విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి బాల రాజు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులోని స్థానిక సోమప్ప సర్కిల్ లో ధర్నా నిర్వహించిన ఏఐటీయూసి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ..32 మంది ప్రాణ త్యాగాలతో ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్ష పార్టీలు టిడిపి, జనసేన పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పోరాడాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమయిన ఐరన్ గనులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం మొండి వైఖరితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధపడితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బిటి చిన్నన్న, మంగలి సత్యన్న ,శాంతప్ప, అమృత రాజు, మునీర్, వీరేంద్ర, మాదన్న, ఇర్ఫాన్, రమేష్, మహానంది, డేవిడ్, విజయ్, వెంకటేష్ పాల్గొన్నారు.
AITUC: విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES