Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్AITUC: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని అడ్డుకుంటాం

AITUC: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని అడ్డుకుంటాం

బనగానపల్లె పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ, సిఐటియు, పిలుపులో భాగంగా వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలో భాగంగా సిపిఐ ఏఐటీయూసీ, సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బనగానపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఏ సుబ్బారెడ్డి, ఏఐటియుసి నంద్యాల జిల్లా ఏఐటియుసి ఆర్గనైజేషన్ సెక్రెటరీ డి శివ బాలకృష్ణ , సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఏ శివయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సిపిఎం మండల కార్యదర్శి సుబ్బయ్య మాట్లాడుతూ. దేశభక్తి పేరు చెప్పే కేంద్ర బీజేపీ ప్రభుత్వం దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అదానీలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను 100 శాతం అప్పగించాలనే కుట్రకు వ్యతిరేకంగా 800 రోజుల కు పైబడి ప్లాంట్ వద్ద రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, వై ఎస్ ఆర్ సి పి పార్టీ లు మినహా అన్ని రాజకీయ పార్టీలు రెండుసార్లు బంద్ నిర్వహించాయి. అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినా ప్రజాభిప్రాయాన్ని పెడచెవిన పెట్టడం దుర్మార్గం. స్టీల్ ప్లాంట్ గతం వరకు లాభాల్లో నడిచింది. గత సంవత్సరం కూడా రూ. 30 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇటీవల కేంద్ర మంత్రి విశాఖ సందర్శించినప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఉదయం ఒక మాట, సాయంత్రం మరో మాట, చివరికి కేంద్ర ప్రభుత్వం అమ్మేది అమ్మేదేనని ప్రకటించడం రాష్ట్రంలో తెలుగు ప్రజల, రాజకీయ పార్టీల మరియు ప్రజా సంఘాల సుదీర్ఘ పోరాటాన్ని కేంద్రం అపహాస్యం చేయడమే. ఈ నిరంకుశ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలంటే దాని విలువ కట్టాలి. దాని కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలను ప్లాంట్లోనికి రానివ్వలేదు. 20 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ వాటాలు అమ్మాలని ప్రయత్నించినా ఇంత వరకూ ఒక్క శాతం కూడా అమ్మలేకపోయారంటే పోరాటమే కారణం. ముడి సరుకులు కొనడానికి డబ్బులు లేవనే పేరుతో గత 15 నెలల నుంచి బ్లాస్ట్ ఫర్నెష్ తో సహా అనేక ముఖ్య విభాగాలను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. 30 శాతం పైగా ఉత్పత్తి తగ్గించింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కుట్ర వల్ల విశాఖ స్టీలు నష్టాల్లో ముంచింది. అందుకే నూరు శాతం ఉత్పత్తి సామర్ధ్యంతో విశాఖ ఉక్కు పరిశ్రమను నడపాలని వారు డిమాండ్ చేశారు. 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు ప్రాణ త్యాగాలకైనా తెగించి పోరాటం చేస్తామన్నారుఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు శివ నాగయ్య ,ఖాదర్, రైతు సంగం నాయకులు ఇమామ్ ,ఏ ఐ టి యు సి అధ్యక్షులు కుల్లాయి స్వామి ,ఆటో యూనియన్ నాయకులునాగాంజనేయులు ,శివ, కార్తీక్ ,రవి ఎరుకలు హుసేని ఏఐటీయూసీ,సిఐటియు సిపిఐ, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News