Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Allagadda: ప్రతి సంక్షేమం పథకం ప్రతి పేదవాడికి అందించాం

Allagadda: ప్రతి సంక్షేమం పథకం ప్రతి పేదవాడికి అందించాం

ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందించామని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. శిరివెళ్ల మండల కేంద్రంలోని 1వ సచివాలయం పరిధిలో 1వవార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్రా రెడ్డి పాల్గొన్నారు. సిరివెళ్ల చేరుకున్న ఆయనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం గడపగడపకు వెళ్లి ఆత్మీయ పలకరింపుతో పలకరించి సంక్షేమ పథకాల వివరాలు వివరిస్తూ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకుని అందనివారు అర్హులైన వారు ఎవరైనా ఉంటే తెలుపాలని ఆయన కోరారు. అలాగే అధికారులకు ఆదేశిస్తూ అర్హులైన వారు ఉంటే వారి వివరాలు సేకరించి వెంటనే సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలన్నారు. అలాగే ఏ సమస్యలు తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే గంగుల తెలిపారు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నాటి ప్రభుత్వాలకు మన ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనిస్తున్నారని నాడు మాటలు ప్రభుత్వమని నేడు అభివృద్ధి చేసి చూపిస్తున్న ప్రభుత్వం అని ఎమ్మెల్యే గంగుల అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని మీ అందరి ఆశీస్సులు దీవెనలు తెలపాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసీం ,,జడ్పిటిసిమెంబర్ దిల్షాద్ ,సలాం ,సర్పంచ్ లక్కాకుల సాలమ్మ , ఉపసర్పంచ్ ఇంతియాజ్, రఫీ మాజీ జెడ్పిటిసి నజీర్, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad