నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యమని రాష్ట్ర జనం వనరుల శాఖ రాష్ట్ర సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దోర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలలో బుధవారం ఒక్కరోజే 3.58 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర జలవనవ శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. దొర్నిపాడు మండలంలోని మండలం w. గోవిందిన్నే గ్రామంలో కలగొట్ల నుంచి గోవిందీన్నే గ్రామానికి, కంపమల్ల గోవిందిన్నే గ్రామాల నడుమ రహదారినీ 1 కోటి 4 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీలో సిసి రోడ్డును 17 లక్షల రూపాయలతో నిర్మించారు. ఆయా పనులను ఈ సందర్భంగా వారు ప్రారంభించారు.
20 లక్షలతో సిసి రోడ్డు..
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ప్రారంభించిన ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి లు ప్రారంభించారు. అనంతరం దోర్నిపాడు మండల కేంద్రంలో46 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం1, 2 వ రైతు భరోసా కేంద్రాన్ని కూడా వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దోర్నిపాడు మండలం డాక్టర్ కొట్టాల గ్రామంలో 2 కోట్ల 27 లక్షల రూపాయలతో ఉయ్యాలవాడ, దోర్నిపాడు, శిరివెళ్ల మూడు మండలాలను కలుపుతూ నూతనంగా నిర్మించిన రహదారిని కూడా వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గెలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తమ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళిన మౌలిక సదుపాయాలకు కొదవ లేకుండా 4 సంవత్సరాల వ్యవధిలోనే వెల్లువలా అభివృద్ధి జరిగిందని అన్నారు. రాష్ట్ర సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని వారన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే మాధ్యేమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ మండల కన్వీనర్ బుడ్డా చంద్రమోహన్ రెడ్డి, ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ, పోచా వెంకటరెడ్డి, నాగేశ్వరరావు యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి , ఏడీఏ సుధాకర్ తాసిల్దార్ జయప్రసాద్ ,ఎస్సైలు సత్యనారాయణ, తిరుపాల్, పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.