Wednesday, September 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: 8 గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల

Allagadda: 8 గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల

మళ్లీ జగనే సీఎం అవుతారు

దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, కొండాపురం అమ్మిరెడ్డి నగరం, అర్జునాపురం, దొర్నిపాడు బురారెడ్డి పల్లె, చాకరాజు వేముల, ఉమాపతి నగర్ గుండుపాపల, గ్రామాలలో రెండు కోట్ల 68 లక్షల రూపాయలతో జరిగిన అభివృద్ధి పనులకు ఆర్లగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భాగ్యనగరం ఉమాపతి నగర్ గుండుపాపల అమ్మిరెడ్డి నగర్ చాకరాజు వేముల దొర్నిపాడు అర్జునాపురం గ్రామాలలో ఏర్పాటు చేసిన సిసి రోడ్లకు కొండాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ ను ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలోప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

అభివృద్ధిని, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొంది, మరొకసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారెడ్డి పంచాయతీ రాజ్, ఏఈ కొండారెడ్డి , మండల స్థాయి అధికారులు వైసిపి నాయకులు ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి జడ్పిటిసి శకుంతల రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు భూమా చెంచిరెడ్డి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగేశ్వరావు యాదవ్ దొర్నిపాడు సర్పంచ్ మంటి దేవమణి, కొండాపురం సర్పంచ్ మాధవి లత, శివరామిరెడ్డి డీలర్ శివారెడ్డి, లక్కుమాధవి, ఎంపీటీసీ శీలం పార్వతి, ప్రసాద్ రెడ్డి లక్కు చంద్రారెడ్డి, సుభాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి రాముడు హుసేని సర్పంచ్ బాలసుబ్బయ్య జక్కుల రాముడు, బ్రహ్మయ్య శ్రీపతి ప్రసాద్ రాయల్, శివారెడ్డి పంచాయతీ కార్యదర్శులు సుమిత్ర, ఉసేని, నాగార్జున మహేష్, వెంకట నారాయణ మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News