క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా క్లాప్ లో భాగంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి 5 ఈ ఆటోలు ప్రభుత్వం కేటాయించిందని మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల తొమ్మిదో తేదీన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 516 ఆటోలను జండా ఊపి ప్రారంభించారని తెలిపారు. అందులో భాగంగా 5 ఈ ఆటోలు ద్వారా పట్టణంలోని అన్ని వార్డుల్లో తడి పొడి హానికర వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేయుటకు పట్టణంలో పారిశుద్ధాన్ని మెరుగుపరుచుటకు వీటి ద్వారా సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుంటుందని మున్సిపల్ కమిషనర్ ఏవీ రమేష్ బాబు తెలిపారు . ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి సహకారంతో ఆళ్లగడ్డ మున్సిపాలిటీని ఆరోగ్యవంతకరమైన మున్సిపాలిటీగా చేస్తామన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి వీటిని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఏఈ సురేందర్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం సునీత బాలస్వామి అరుణ్ ఏసు జిలాని పాల్గొన్నారు.
Allagadda: మున్సిపాలిటీకి 5 E-ఆటోలు
ఈ ఆటోలు ద్వారా పట్టణంలోని అన్ని వార్డుల్లో తడి పొడి హానికర వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేస్తాం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES