Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: వాడవాడలా వైయస్సార్ 74వ జన్మదినం

Allagadda: వాడవాడలా వైయస్సార్ 74వ జన్మదినం

రైతు బాంధవుడు వైఎస్ ను ఎవరూ మరిచిపోలేరు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ పుట్టినరోజు జయంతి ఘనంగా జరిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల సెంటర్లో ఉన్న దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి, విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ,ఎంపీపీ లు గజ్జల రాఘవేంద్ర రెడ్డి ,అమర్నాథరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, పట్టణ వైకాపా ఇన్చార్జి కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయూబ్ రసూల్, మహాలక్ష్మి అధినేత రంగేశ్వర్ రెడ్డి పడకండ్ల సుధాకర్ రెడ్డి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ శీలం సురేంద్ర నాథ్ రెడ్డి లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

- Advertisement -

అనంతరం వైయస్సార్ జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ పుట్టినరోజు జయంతిని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో ఆయన జయంతిని ఘనంగా జరిగాయన్నారు. ఆ మహానుభావుడిని ఎవరు కూడా మర్చిపోలేరని రైతు బాంధవుడిగా రైతాంగ హృదయాల్లో నిలిచిపోయిన ఆదర్శమూర్తిగా రైతాంగం ఉన్నంతవరకు వైయస్ రాజశేఖర్ రెడ్డిని మర్చిపోలేరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధన కోసం కష్టపడి పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడారు .ఈ కార్యక్రమంలో యాదవాడ నరసింహారెడ్డి ,బుడ్డా చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు నాసారి చక్రపాణి, బాలబ్బి , నరసింహులు గురుమూర్తి కో ఆప్షన్ మెంబర్ రమేష్ గౌడ్ కాంట్రాక్టర్ నజీర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వినోద్ ,మాదం చెన్నయ్య, మాదం కిషోర్, శివాలయం భాస్కర్ రెడ్డి, కొండపల్లి శేఖర్ రెడ్డి, మాడిశెట్టి శ్రీనివాసులు దాల్ మిల్ గఫూర్, మాడిశెట్టి చక్రి ,పడకండ్ల భాస్కర్ రెడ్డి, ఓబులంపల్లి లింగారెడ్డి ,నరసయ్య వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News