అర్హులైన ప్రతి కార్మికుడికి లబ్ది చేకూరేలా అధికారులు పని చేయాలని ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని 3వ బ్లాక్ లోని తన ఛాంబర్లో అధికారులతో మంత్రి గుమ్మనూరు జయరాం ఈమేరకు సమావేశం ఏర్పాటు చేశారు. వైయస్ఆర్ బీమా, లేబర్ సెస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ బీమా పథకం కేంద్ర ప్రభుత్వము సహకారం లేకుండా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వైయస్ఆర్ బీమా పెండింగ్ లో ఉన్న 262 అప్లికేషన్స్ ను ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలి సూచించారు. కార్మిక సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలి అన్నారు. వైయస్ఆర్ బీమా బాధితులకు నియమిత కాలంలో చెల్లించవలసిందిగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులను కోరారు.
- Advertisement -