Monday, November 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Anantapuram: గెలుపుతో రండి

Anantapuram: గెలుపుతో రండి

ఆల్ ద బెస్ట్- అధినేత

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తెదేపా అధికారంలోకి కోసం ఎదురుచూస్తున్నారని, అదే ఊపుతో ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సత్యసాయి జిల్లా టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులతో పేర్కొన్నారు. టీడీపీ టికెట్ల కేటాయింపు విధానంలో పార్టీ అధిష్టానం అన్ని విధాలుగా అభ్యర్థులపై అనేక సర్వేలు నిర్వహించి మంచి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని నియోజకవర్గ అభ్యర్థులకు బీ ఫామ్ అందజేసే కార్యక్రమంలో భాగంగా అభ్యర్థులకు పలు జాగ్రత్తలు సూచనలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా టీడీపి అధినేత మాట్లాడుతూ ,సత్యసాయి జిల్లాల్లో ఉన్న హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథి ,ధర్మవరం అసెంబ్లీ బీజీపీ ఉమ్మడి అభ్యర్థి తో పాటు పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర ,పెనుకొండ , అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులు విజయంతో తిరిగి రావాలని సూచించారు. అందరం రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పుట్టపర్తి నియోజకవర్గ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణ మడకశిర అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెస్ రాజు, పెనుగొండ అసెంబ్లీ అభ్యర్థి సవితా, కదిరి అసెంబ్లీ కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీ ఫామ్ అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News