Andhra Pradesh Government :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలకు అండగా నిలబడింది. పండుగ సీజన్‌లో వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు వాహన మిత్ర పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అక్టోబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిధులను అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా డ్రైవర్లు తమ వాహనాలకు బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు వంటి అవసరాలను తీర్చుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు:
ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19. దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సమర్పించవచ్చు.
RK Roja Slams Pawan Kalyan : పవన్‌కు ప్రజలు ఓట్లేసింది సినిమా షూటింగ్‌లు చేసుకోవడానికా..?
సెప్టెంబర్ 17: దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.
సెప్టెంబర్ 19: దరఖాస్తులకు చివరి తేదీ.
సెప్టెంబర్ 22: క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి.
సెప్టెంబర్ 24: లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం.
అక్టోబర్ 1: ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిధుల విడుదల.
అర్హత ప్రమాణాలు:
ఈ పథకానికి అర్హులవ్వడానికి కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి.దరఖాస్తుదారుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన సొంత వాహనం ఉండాలి.చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.పేదరిక రేఖకు దిగువన (బీపీఎల్ రేషన్ కార్డు) ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులు (పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు).నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు.
వాహనంపై పెండింగ్ టాక్స్‌లు, చలాన్లు ఉండకూడదు.వ్యవసాయ భూమి, పట్టణ ప్రాంతాల్లోని నివాస స్థలాల పరిమితులకు సంబంధించిన నియమాలు కూడా వర్తిస్తాయి. ప్రభుత్వం ఈసారి దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయనుంది. గత సంవత్సరం లబ్ధిదారుల వివరాలను కూడా పునఃసమీక్షించి, అర్హత గలవారికి త్వరితగతిన సహాయం అందజేయనున్నారు.


