Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Mega DSC: నేడే మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!

Mega DSC: నేడే మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!

Mega DSC Final Selection List: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు డీఎస్సీ కన్వీనర్ వెంకట‌ కృష్ణారెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో వివిధ మేనేజ్‌మెంట్లు, సామాజిక వర్గాలకు చెందిన 300కు పైగా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. వీటిని తదుపరి డీఎస్సీలో భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20న ఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా.. జూన్ 6 నుంచి జూలై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ జూలై 5న, తుది కీ ఆగస్టు 1న విడుదలయ్యాయి. ఎంపిక ప్రక్రియలో టెట్‌కు 20% వెయిటేజీ ఇచ్చారు. ఏడు విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. ఈ తుది జాబితా విడుదల కోసం వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ముఖ్యమైన వివరాలు: తుది జాబితాను జిల్లా కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాలు మరియు అధికారిక వెబ్‌సైట్ cse.apcfss.in లో అందుబాటులో ఉంచుతారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలోని సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ కార్యక్రమం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వారికి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఉంటాయి. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున వీరు విధుల్లో చేరనున్నారు.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/ys-jagan-dilemma-assembly-attendance-mla-post-risk/

ఎంపిక ప్రక్రియ: మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఏప్రిల్ 20న విడుదలైంది. 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6 నుంచి జూలై 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు జరిగాయి. ఈ ప్రక్రియలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఇచ్చారు. ఏడు విడతలుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. ఈ నియామకాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు గణనీయంగా తగ్గి.. విద్య నాణ్యత మెరుగుపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad