సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి సమావేశమైంది, 2024–25 ఆర్ధిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్.
మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు…
2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి. నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల.
నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల. ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన… గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.