National Handloom Day : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి ఆటోనగర్‌లో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. చేనేత ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ALSO READ : Teacher Promotions : ఉపాధ్యాయుల పదోన్నతులకు బ్రేక్!
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగానికి పెద్ద ఎత్తున మద్దతు అందిస్తోంది. సాంప్రదాయ మగ్గాలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఇది రాష్ట్రంలోని 65,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూర్చనుంది. అంతేకాక, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీనివల్ల ఉత్పత్తుల ధరలు తగ్గి, విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. చేనేత కార్మికుల ఆర్థిక భద్రత కోసం రూ. 5 కోట్ల థ్రిఫ్ట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ALSO READ : TG Weather updates: తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
ఈ నిర్ణయాలు ఆగస్టు 7, జాతీయ చేనేత దినోత్సవం నుంచి అమలులోకి వస్తాయి. ఈ చర్యలు చేనేత రంగాన్ని పునరుద్ధరించడంతో పాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని తెలుస్తోంది. ఇక వీటితో పాటు ఇప్పటికే సీఎం చంద్రబాబు నెలకు కనీసం ఒకసారి చేనేత వస్త్రాలను ధరించాలని, కొనుగోళ్లు ప్రోత్సహించాలని.. దీనివల్ల సాంప్రదాయ కళలు, సంస్కృతి సజీవంగా ఉంటాయని తెలిపారు.


