Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్ఉగాది సందర్భంగా పేదలకు ఆర్థిక సహాయం ప్రకటించిన చంద్రబాబు..!

ఉగాది సందర్భంగా పేదలకు ఆర్థిక సహాయం ప్రకటించిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా పేదలకు పెద్ద సహాయాన్ని ప్రకటించారు. ఉగాది నాడు రూ.38 కోట్ల సీఎం సహాయ నిధికి ఆమోదముద్ర వేశారు, దీని ద్వారా 3,456 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ.281 కోట్లు విడుదల చేశారు. వైద్యం కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ నిధి దీవిగా మారుతోంది.

- Advertisement -

ఈ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా, సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు.

రాష్ట్రం ఆర్థిక పరంగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నా, రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు సీఎం తెలిపారు. ప్రజల పనులు తేలికగా పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ‘వాట్సాప్ గవర్నెన్స్’ను ప్రవేశపెట్టామని తెలిపారు. ఇరవై ఏళ్ల క్రితమే ఐటీ రంగం ప్రాధాన్యత గురించి తన దృష్టికోణాన్ని వెల్లడించానని, అప్పట్లో ఆ రంగాన్ని ఎంచుకున్న వారు ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News