తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు కలెక్టర్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ఏపీలో మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్ ఆర్ ఎమ్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం ఉదయం చెన్నై నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు పుష్పగుచ్చం అందజేసి, గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయ డైరెక్టర్ ఎంఎల్ కె రెడ్డి, ప్రోటోకాల్ ఏడి విజయ్ కుమార్, స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం తెలంగాణ గవర్నర్ రోడ్డు మార్గంలో నీరుకొండ బయలుదేరి వెళ్లారు.

