రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు నిర్వహించే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు సీఎం వైయస్. జగన్.
ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ఎండి జి లక్ష్మీషా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అదనపు డైరెక్టర్ భావన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.