వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్. జగన్ రివ్యూ చేశారు. భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, స్పెషల్ సీఎస్‌లు జి.సాయి ప్రసాద్, వై.శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, బుడితి రాజశేఖర్, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఐఏఎస్‌లు సిద్దార్ధ్ జైన్, ఏ.ఎండి.ఇంతియాజ్, ప్రవీణ్ కుమార్, షన్మోహన్, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అత్యంత ప్రాధాన్యత అని స్పష్టంచేసిన సీఎం.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో సర్వే చేపట్టడంలేదన్న సీఎం. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని, ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్తు తరాలవారికీ కూడా చాలా ఉపయోగమని తెలిపిన సీఎం.
నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్న సీఎం. జాప్యానికి తావులేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని ఆదేశించిన సీఎం. రెవిన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలసుకున్న సీఎం.
ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందన్న అధికారులు. మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్న సీఎం. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలన్న సీఎం. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందన్న సీఎం.
అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాలన్న సీఎం. రోవర్ తరహా… పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్న సీఎం. దీనివల్ల సర్వేయర్ పూర్తిస్ధాయిలో తన పనిని పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందన్న సీఎం. అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలపై ఆలోచనలు చేయాలన్న సీఎం.
సర్వే పూర్తైన తర్వాత సరిహద్దులు వద్ద వేసేందుకు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధంచేశామని తెలిపిన అధికారులు. రోజుకు 50వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరాచేసేందుకు ప్రణాళిక వేసుకున్నామన్న అధికారులు. తర్వాత దశల్లో జరిగే సర్వే ప్రక్రియ కోసం రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలన్న సీఎం.