Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: సాయిరెడ్డి నేతృత్వంలో వైసిపి అనుబంధ విభాగాల భేటీ

AP: సాయిరెడ్డి నేతృత్వంలో వైసిపి అనుబంధ విభాగాల భేటీ

గత ఎన్నికల్లో గెలుపు కోసం అనుబంధ విభాగాలు వైసీపీ కోసం పనిచేసినట్టే 2024 గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలి

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి అధ్యక్షతన అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ముందుగా ఇటివల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి ఈ సమావేశంలో నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించారు..అనుబంధ విభాగాలలో ఖాళీగా ఉన్న పధవులను త్వరితగతిన భర్తీ చెయ్యాలి. అలాగే గతంలో పార్డీ నిర్వహించిన జయహో బీసీ సమావేశం మాదిరిగా ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనారిటీ సమావేశాలు రాష్ట్ర స్ధాయీలో నిర్వహణపై కూడా చర్చ జరిగింది. వివిధ సామాజిక వర్గాలకు, విభాగాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు, కార్యక్రమాలు ఇంటింటికీ ప్రచారం ఎలా చెయ్యాలి అన్నదాని మీద చర్చించారు. అనుబంధ విభాగాల అధ్యక్షులకు అదనంగా మరికొంత మందిని నియామించే సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు విజయసాయిరెడ్డికి ఈ నాలుగు అంశాలతో పాటు వివిధ అంశాలపై సలహాలు, సూచనలను చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ…ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు గెలుపు కోసం అనుబంధ విభాగాలు పార్టీ కోసం ఎలా పని చేశాయో…అలాగే 2024 గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు..పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు. త్వరితగతిన పార్టీ అనుబంధ విభాగాల జోనల్ ఇంచార్జీలు, జిల్లా ప్రెసిడెంట్స్, మండల ఇంచార్జిల ఖాళీలను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుని అనుబంధ విభాగాల అధ్యక్షులు భర్తీ చేయాలి… జయహో బిసి మహాసభ ఎలా అయితే విజయవంతమైందో త్వరలో పార్టీ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, మహాసభలు విజయవంతం అయ్యేలా అనుబంధ విభాగాల అధ్యక్షులు కృషి చెయాలి.. ఏదైనా సమస్యలుంటే అనుబంధ విభాగాల అధ్యక్షులు తన దృష్టికి తీసుకురావాలని విజయసాయిరెడ్డి కోరారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి, అన్ని అనుబంధ విభాగాల ఇంచార్జిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News