Tuesday, October 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Athmakuru: పచ్చని తోరణంలా నల్లమల అభయారణ్యం

Athmakuru: పచ్చని తోరణంలా నల్లమల అభయారణ్యం

పచ్చల హారం..

ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తలమానికంగా లక్షల హెక్టార్లలో విస్తరించిన నల్లమల అభయారణ్యం జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా మారింది. నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్టులో వేలాది అరుదైన జీవరాశులు సంచరిస్తున్నాయి.

- Advertisement -

సున్నిపెంట బయోడైవర్సిటీ..

అటవీశాఖ చేపడుతున్న ప్రత్యేక రక్షణ చర్యలతో వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది. అడవులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా సున్నిపెంట బయోడైవర్సిటీ డివిజన్‌ కార్యాలయం కేంద్రంగా శాస్త్రవేత్తలు జీవ వైవిధ్యంపై పలు పరిశోధనలు చేపట్టారు. ప్రధానంగా అంతరించి పోతున్న పులుల సంతతిపై దృష్టిసారిస్తున్నారు. ఈక్రమంలో అరుదైన జీవ జాతులను గుర్తిస్తున్నారు. నల్లమల అటవీప్రాంతం విశాలమైనది.

జీవులకు అందివచ్చిన వరం..

ఈ ప్రాంతం అనేక జీవరాశులకు అందివచ్చిన వరం. పచ్చని పరిసరాలు, దట్టమైన చెట్లు, వివిధ జంతుజాలాలతో నిండి ఉంది. పచ్చని భారీ వృక్షాలు, జలపాతాలు, జంతుజాలంతో అందాల స్వర్గ సీమగా పేరుగాంచింది. నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు విస్తరించి పచ్చల హారంగా విరాజిల్లుతోంది.

అటవీ శాఖ ప్రత్యేక చర్యలు

నల్లమల అడవిలో ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భైర్లూటీ చెంచు గూడెంలో ఏకో టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. తద్వారా యాత్రికులు అటవీ అందాలను తిలకిస్తూ ప్రకృతి అందించిన సంపదను సంరక్షించుకునేందుకు వీలుగా అవగాహన కల్పిస్తున్నారు. పక్కనే ఉన్న సిద్దాపురం ఎత్తిపోతల పథకంలో బోటింగ్ ఏర్పాటు చేసి మరింతగా పర్యాటకంగా అభివృద్ధి చెయ్యాలని యోచిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News