నల్లమల అటవీ సమీప గ్రామాల ప్రజలకు తరుచూ పులుల సంచారం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన – నల్లకాలువ గ్రామాల మధ్య ఓ పెద్ద పులి గ్రామస్థులకు తారసపడింది. శనివారం రాత్రి నల్లకాలువ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ క్షేత్రానికి సమీపంలో వెలుగోడు రేంజ్ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన పెద్ద పులి రోడ్డుపై వెళ్తుండగా స్థానిక రైతులు, ప్రయాణికులు గుర్తించి ఆత్మకూరు అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. వేట లేదా నీటి కోసమే పెద్ద పులి బయటికి వచ్చి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పులి జాడను గుర్తించి అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు పేర్కొన్నారు.
Atmakur: పెద్ద పులి సంచారంతో భయం భయం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES