అవుకు మండలంలోని ఎర్రమల కొండల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన మారేమడుగుల, పిక్కిల్లపల్లి తండాలు. దారి కూడా లేని ఈ గ్రామాలు నేడు భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ విద్యుత్తు ప్లాంటుకు కేంద్రంగా మారనున్నాయి. అవుకు మండలంలోని కొండ ప్రాంతాలైన మారేమడుగుల, పిక్కిళ్లపల్లి తాండ గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారని అధికారుల పేర్కొంటున్నారు.
అమరావతికి చెందిన గ్రీన్ కో కంపెనీ 2300 మెగా వాట్స్ సోలార్ విద్యుత్తు ప్లాంటును మండలంలోని ఉప్పలపాడు, జూ నూతల, కొండమ నాయన పల్లి, పిక్కిళ్ళపల్లి తండా, మారేమడుగుల గ్రామాల పరిసర ప్రాంతాలలో 8 వేల ఎకరాలలో ఏర్పాటు చేయనుంది. 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిన ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన పైలాన్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏది ఏమైనా తమ ప్రాంతంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు అవుతుండడంతో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.