బనగానపల్లె పట్టణంలోని యాగంటి పల్లె రహదారులు బనగానపల్లె పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కు ఉచితంగా ఐదు సెంట్ల స్థలాన్ని బనగానపల్లె నియోజకవర్గం కేటాయించారు. బనగానపల్లె పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ భవన నిర్మాణానికి బనగానపల్లె ఎమ్మెల్యే కార్సన్ రామ్ రెడ్డి అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి భూమి పూజ నిర్వహించినారు. అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యే సోదరుడు కాటసాని తిరుపాల్ రెడ్డి బనగానపల్లె మండల అభివృద్ధి అధికారి శివరామయ్య బనగానపల్లె గ్రామపంచాయతీ కార్యనిర్వహణ అధికారి ఖలీల్ కి క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సంఘం వారు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా బనగానపల్లె పట్టణ క్లాస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రవికుమార్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ కు ఉచితంగా ఐదు సెంట్లు స్థలాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కేటాయించిన రుణాన్ని తీర్చుకోలేమని, వచ్చే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అఖండ మెజార్టీతో గెలిపించుకుని తమ రుణాన్ని తీర్చుకుంటామని చెప్పారు. బనగానపల్లె పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు అందరూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అండగా ఉంటామని చెప్పారు. క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కు ఉచితంగా ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించిన బనగానపల్లె ఎమ్మెల్యే కార్సన్ రామ్ రెడ్డి తమ అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో వ్యాపార రంగంలో ఆర్యవైశ్యుల ప్రముఖ పాత్ర ఉందని చెప్పారు. వ్యాపార రంగానికి చెందినటువంటి సుదూర ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులు ఇక్కడ రాత్రిపూట విడిది చేయడానికి వారికి అసోసియేషన్ భవనాలు లేకపోవడంతో నానా ఇబ్బందులు ఉండేవారని ఆ సమస్య నేటితో తీరిపోతుందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. మండి మర్చంట్ అసోసియేషన్ భవన నిర్మాణం ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో నిలబడిపోయిన సంగతి ప్రజలకు తెలిసిన విషయమే అని వాటికి కూడా ప్రభుత్వ అనుమతులు అందించామని, భవన నిర్మాణం కూడా పూర్తయిందని, అలాగే క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సంఘానికి వారికి కూడా భవనం నిర్మించుకోవడానికి స్థలం లేకపోవడంతో ఐదు సెంట్లు స్థలాన్ని ఉచితంగా కేటాయించినట్టు తెలిపారు. ఐదారు నెలల్లోనే భవన నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా చేసుకుందామని తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గాన్ని అన్ని విధాల అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామని బనగానపల్లె నియోజకవర్గానికి అహర్నిశలు కష్టపడే నాయకుడు ఎవరని ప్రజలు తెలుసుకోవాలని కష్టపడే నాయకునికి మళ్ళీ అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె మండల అభివృద్ధి అధికారి శివరామయ్య, బనగానపల్లె గ్రామపంచాయతీ కార్యనిర్వహణ అధికారి ఖలీల్, వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఆర్యవైశ్య ప్రముఖుడు డెంటల్ డాక్టర్ రవికుమార్, ఆర్యవైశ్య అధ్యక్షుడు గాదంశెట్టి వేణుగోపాల్, ఆర్య వైశ్యులు శాశ్వత గౌరవ అధ్యక్షుడు పసుపల సుబ్బ సత్యనారాయణ, నూకల వెంకటసుబ్బయ్య, నూకల విజయ్ కుమార్, గాదంశెట్టి మోహన్, మండి మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఎస్ ఎమ్ సత్యనారాయణ శెట్టి, ప్రధాన కార్యదర్శి చక్రపాణి, టీవీ షో రూమ్ గోపాల్, యాగంటి దేవస్థానం పాలకమండలి చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకుడు జిల్లెళ్ళ శంకర్ రెడ్డి, ప్రముఖ సీనియర్ న్యాయవాది మాధవరెడ్డి, వైయస్సార్ పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్, డాక్టర్ మహ్మద్ హుస్సేన్, సైకిల్ షాప్ మహబూబ్ వలి, బనగానపల్లె పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.