Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా గాదంశెట్టి వేణుగోపాల్ ఏకగ్రీవం

Banaganapalli: ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా గాదంశెట్టి వేణుగోపాల్ ఏకగ్రీవం

బనగానపల్లె పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణంలో బనగానపల్లె పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు- కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆర్యవైశ్యుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మండలం ఎంపీడీవో శివరామయ్య, సంజామల మండల వైయస్సార్ పార్టీ నాయకులు పెండేకంటి కిరణ్ కుమార్, ఆర్యవైశ్యులు హాజరు అయ్యారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లి పట్టణ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గాదం శెట్టి వేణుగోపాల్ డాక్టర్ రవి కుమారులు పూలమాలలతో, బొకేలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బనగానపల్లె పట్టణ నూతన ఆర్యవైశ్య అధ్యక్షుడు గాదంశెట్టి వేణుగోపాల్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ ఆర్యవైశ్యులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎంపీడీవో శివరామయ్య శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ తమ కాటసాని కుటుంబం లో నుంచి పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులుగా కొనసాగడం జరుగుతుందని అందుకు ప్రధాన కారణం నాడు పెండేకంటి వెంకటసుబ్బయ్య గారి దివ్య ఆశీస్సులతోనే నేడు తాము రాజకీయపరంగా ఉన్నామని చెప్పారు. ఆయన చేసిన మేలుని తమ జీవితాంతం కాటసాని కుటుంబం పెండేకంటి వెంకటసుబ్బయ్య గారికి రుణపడి ఉంటామని చెప్పారు.

- Advertisement -

ఆర్యవైశ్య సోదరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తనను కలవవచ్చని చెప్పారు. ఆర్యవైశ్య సోదరుల స్మశాన వాటికకు 8:50 లక్ష రూపాయలు కేటాయించడం జరిగిందని అంతేకాకుండా మరో 10 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే ఆర్యవైశ్య కుటుంబాల్లో కూడా పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని వారికి కూడా ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఆర్యవైశ్య కుటుంబాలు పెళ్లిళ్లు చేసుకోవడానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చాలా చిన్నదిగా ఉందని కాబట్టి వారికి ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని చెప్పారు. అంతేకాకుండా మండపం నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని ఆర్యవైశ్యులకు ఎమ్మెల్యే కారుసాని రామిరెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది.

ఆర్యవైశ్యులు కేవలం వర్తక వ్యాపారాల మీదే కాకుండా రాజకీయపరంగా కూడా ముందుకు రావాలని అలాంటి వారికి తన వంతు సహాయ సహకారాలు, అండదండలు ఉంటాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం వాణిజ్య విభాగం అధ్యక్షుడు టంగుటూరి శినయ్య, బనగానపల్లె పట్టణ ఆర్యవైశ్య సంఘం శాశ్వత గౌరవ అధ్యక్షులు పసుపల సుబ్బ సత్యనారాయణ, డాక్టర్ రవి కుమార్, మండి మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చక్రపాణి, ఎస్ ఎస్ ఎమ్ సత్యనారాయణ, నల్లగట్ల వెంకటేశ్వర్లు, కేతేపల్లి శివచంద్రయ్య, ఆర్యవైశ్య యువజన సంఘం కేతపల్లి శివరాజ్, జక్కా సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, బచ్చు మధుసూదన్ గుప్తా, గుండా బాలాజీ, ఆర్యవైశ్య మహిళలు బండారు లలిత, గుండా సుప్రజా, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News