Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: గురు రాఘవేంద్ర విద్యాసంస్థల సేవలు అభినందనీయం

Banaganapalli: గురు రాఘవేంద్ర విద్యాసంస్థల సేవలు అభినందనీయం

వరద బాధితులకు బియ్యం పంపిణీ

నంద్యాల శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల సేవ కార్యక్రమాలు అభినందనీయమని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ అభినందించారు. విజయవాడ వించిపేటలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వరద బాధితుల సహాయార్థం బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అత్యున్నత కోచింగ్ సెంటర్ అయిన నంద్యాలకు చెందిన గురు రాఘవేంద్ర విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ పి. దస్తగిరి రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కలిసి ఒక్కో కుటుంబానికి 10 కేజీల చొప్పున మొత్తం 1000 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వరదల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎంతో నష్టపోయారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాలలో పర్యటించి వారి కష్టాలు తెలుసుకొని అండగా నిలిచారని అన్నారు. ఆయన ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర నలుమూలల నుండి బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. గురు రాఘవేంద్ర విద్యా సంస్థల అధినేత దస్తగిరి రెడ్డి వారి కుమారులు సీఎం రిలీఫ్ ఫండ్ కు కూడా రూ.2.50 లక్షలు విరాళం అందించారని అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారని అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గురు రాఘవేంద్ర సంస్థల ఛైర్మన్ దిస్తగిరి రెడ్డి కుమారులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News