Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: సంక్షేమం-అభివృద్ధి రెండూ చేస్తున్నాం

Banaganapalli: సంక్షేమం-అభివృద్ధి రెండూ చేస్తున్నాం

అవుకు మండలం సుంకేసుల గ్రామ సచివాలయం పరిధిలో రెండవ రోజు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామ ప్రజలు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన వారు ఎవరైనా వుంటే వారికి ఎవరికైనా పథకాలు రాకుంటే అలాంటి వాటికి పరిష్కరించాలంటూ సచివాలయం ఉద్యోగులను ఎమ్మెల్యే కాటసాని ఆదేశించారు. అలాగే సుంకేసుల గ్రామ సచివాలయం పరిధిలో 2 కోట్ల 75 లక్షల 78 వేల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయడమే కాకుండా భూమి పూజ కూడా నిర్వహించడం జరిగింది. 1 కోటి 75 లక్షల 50 వేల రూపాయల తో నూతనంగా నిర్మించిన ఆకుమల్ల సుంకేసుల (వయా చనుగొండ్ల) గ్రామం మీదుగా నూతనంగా నిర్మించిన తారు రోడ్డు ను ప్రారంభించడం జరిగింది. అలాగే 21 లక్షల 80 వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం మరియు 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణం, 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మంచినీటి పైపులైను లను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం నాడు నేడు పథకం ద్వారా 58 లక్షల 48 వేల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5 అదనపు తరగతుల నిర్మాణానికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. సంక్షేమ పాలనను పేదలకు మరింత చేరువ చేయడానికి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలోను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేసి, ప్రతి గడపలోను సంక్షేమ పథకాలు అందాయో లేదో తెలుసుకొని వారి సమస్యలను ఆ గ్రామంలోని సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని పరిష్కార మార్గం చేయలనే ముఖ్య ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఆ దిశగానే నిర్వహిస్తున్న గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికిగ్రామాల్లో,పట్టణాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది అని ఎక్కడికి వెళ్ళిన కూడా ప్రజలు సతోషం వ్యక్తం చేస్తున్నారు అని ఇంక కొంత మందికి ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల రాలేని వారికి వాటిని పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పారు.పాదయాత్రలో ఇచ్చిన హామీల్లోఇప్పటికే 99 శాతం మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా రెండు కళ్ళలాగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే నేడు సుంకేసుల గ్రామ సచివాలయం పరిధిలో 2 కోట్ల 75 లక్షల 78 వేల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకున్ని మళ్ళీ మనం ముఖ్య మంత్రిగా చేసుకుంటేనే మనమందరం సంతోషం గా పార్టీ లకు, కులాలకు,మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద వానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందడం జరుగుతుంది అని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైయస్సార్ పార్టీ అఖండ మెజార్టీ తో గెలిపించాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ కాటసాని ఓబుల్ రెడ్డి,అవుకు మండల జెడ్పీటీసీ చల్లా శ్రీ లక్ష్మి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సిద్దం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల స్థాయి అధికారులు ఎంపిడిఓ అజాం ఖాన్, తహసిల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తాసిల్దార్ పోతుల ప్రసాద్ బాబు, ఏ ఓ ప్రసాద్ రావు, ఈ ఓ ఆర్ డి రామకృష్ణ వేని, డాక్టర్ ఐశ్వర్య, ఏ ఈ లు కృష్ణరెడ్డి, పక్కిరయ్య, కరిముల్ల, మండల సచివాలయం కన్వీనర్ తళ్లం సుబ్రమణ్యం,చల్లా చరణ్ రెడ్డి,సుంకేసుల గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు పార్థసారథి రెడ్డి, పాల నాగేశ్వరరెడ్డి,చిన్న తులసి రెడ్డి,ప్రతాప్ రెడ్డి, పురు షోత్తం రెడ్డి,భాస్కర్ రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి,గురు రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,నారప రెడ్డి,వెంకట చౌడయ్య,రామచంద్రుడు,రాజేష్,శ్రీనివాసులు,కునుంట్ల పురుషోత్తంనాయుడు,అకుమళ్ళ నాగేశ్వర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు,గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News