బనగానపల్లె పట్టణంలో.వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో నూతన పాలకమండలి కార్యక్రమం ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా గరుడ దీవెనమ్మ వైస్ చైర్మన్ గా సన్నల జనార్దన్ రెడ్డి పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని చెప్పారు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా గరుడ దీవెనమ్మ ఉపాధ్యక్షుడిగా సన్నల జనార్దన్ రెడ్డి మరియు పాలకమండలి సభ్యులందరికీ తన తరఫున ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగిందని చెప్పారు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల ఎంతో పక్షపాతిగా ఉన్నారని రైతులకు తన వంతు సహాయ సహకారాలు అందించడంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ముందున్నారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని నూతన పాలక మండలి సభ్యులకు తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల పంటకు ఇన్సూరెన్స్ ను సైతం వైయస్సార్ ప్రభుత్వమే రైతుల తరఫున చెల్లించడం జరుగుతుందని చెప్పారు. అలాగే అకాల వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లితే ప్రభుత్వం వెంటనే ఆ సీజన్ లోనే పంట నష్టపరిహారం అందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందని కేవలం గిట్టుబాటు ధర కోసం మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలతో పాటు నాణ్యమైన ఎరువులు కూడా అందించడం జరుగుతుందని చెప్పారు. బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గం రైతులకు అండగా ఉండి రైతులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గం లో రెండు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉండడం మన అదృష్టమని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో అసంపూర్తిగా ఉన్నటువంటి గౌడన్ లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే రవ్వలకొండ మీద ఇప్పటికే రైతులు తన వ్యవసాయ ధాన్యాన్ని భద్రపరచడానికి ఒక గౌడన్ ను పూర్తి కావడం జరిగిందని, ఇంకొక గౌడన్ ను 74 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతుందని త్వరలోనే ఆ గౌడన్ ను కూడా నిర్మాణం పూర్తి చేసుకొని రైతులకు అందుబాటులోకి రావడం జరుగుతుందని చెప్పారు. మార్కెట్ యార్డ్ నిధులతో బనగానపల్లి మండలం కాలే నాయక్ తండా, చేర్లో కొత్తూరు, అవుకు మండలం సుంకేసుల గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడి నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాంటి ముఖ్యమంత్రిని ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ప్రజల మీద, నాయకుల మీద, రైతుల మీద ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బనగానపల్లె మండలం డెవలప్మెంట్ అధికారి శివరామయ్య, నంద్యాల నంద్యాల జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి అబ్దుల్ రహమాన్, వ్యవసాయ మార్కెట్ యాడ్ సెక్రటరీ సుందర్ రాజు, బనగానపల్లె పట్టణ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ, భానుముక్కల ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్ నీలి శ్రీనివాసులు,పోలూరికృష్ణనూకలవెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, వైయస్సార్ పార్టీ నాయకులు ఈశ్వర్ నాయక్, ఈసారి ఎల్లయ్య, ఎర్రగుడి రామసుబ్బారెడ్డి, జివి నారాయణ, బాలు , పసుపల సర్పంచ్ మోహన్ లతోపాటు వివిధ గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.
Banaganapalli: వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES