Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు

Banaganapalli: టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు

బనగానపల్లె పట్టణంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణము శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆర్యవైశ్య ఆశాజ్యోతి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతుల పేరున ప్రత్యేక పూజలు నిర్వహించి కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టంగుటూరి సీనయ్య గారు మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఆర్య వైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం శాశ్వత గౌరవ అధ్యక్షులు పి ఎస్ నారాయణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం బనగానపల్లి మండల అధ్యక్షులు పి నాగేంద్ర, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి భరతుడు, సభ్యులు బచ్చు రమేష్, సాయిరాం, గౌరవ అధ్యక్షులు కేతేపల్లి శివచంద్రయ్య, గుండా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి S S M గారు జిల్లా మీడియా కోఆర్డినేటర్ మదన్, ఆర్యవైశ్య ప్రముఖులు నల్లగట్ల వెంకటేశ్వర్లు, నూకల విజయ్, కాసుల జంగం శెట్టి, బండారు ప్రకాష్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బండారు లలిత గౌరవ అధ్యక్షురాలు నూకల వాసంతి ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News