Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: సుప్రీంకోర్టులో వైఎస్ జగన్‌కు భారీ ఊరట

YS Jagan: సుప్రీంకోర్టులో వైఎస్ జగన్‌కు భారీ ఊరట

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)కు సుప్రీం కోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. జగన్ అక్రమాస్తుల కేసు ట్రయిల్ సరిగా జరగకపోవడంతో విచారణ పూర్తవడం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Raghuramakrishnam Raja) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ చంద్రశేఖర్ శర్మ ధర్మాసనం ప్రత్యేక విచారణ అవసరం లేదంటూ ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

- Advertisement -

అలాగే గత 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయకుంటే ఈ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని మరో పిటిషన్ వేశారు. తాజాగా కోర్టు నిర్ణయంతో ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad