వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్(Nandigam Suresh)కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అమరావతి ప్రాంతానికి చెందిన మరియమ్మ హత్య కేసులో అరెస్ట్ అయిన సురేశ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై సురేశ్ అనుచరులు దాడి చేశారు. తన పెన్షన్ నిలిపివేశారని అప్పటి సీఎం జగన్ మీద విమర్శలు చేయడంతో మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను హతమార్చారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.