Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: అలాంటి వారికే నామినేటెడ్‌ పదవులు: సీఎం చంద్రబాబు

Chandrababu: అలాంటి వారికే నామినేటెడ్‌ పదవులు: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని నామినేటెడ్‌ పదవులను జూన్ నెల లోపు భర్తీ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే.. పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు.

- Advertisement -

వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వారు CUBS(క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని.. వైసీపీ తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టాని చంద్రబాబు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad