Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్CM CBN invitation through tweet:

CM CBN invitation through tweet:

పెట్టుబడులకు స్వర్గధామం..

రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం

- Advertisement -

బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఎపి ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్

ఎపిలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ముఖ్యమంత్రి స్వాగతం

సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఎపి స్వర్గధామం అన్న ముఖ్యమంత్రి

పెట్టబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది…మా రాష్ట్రం వృద్ధి చెందుతుంది అంటూ సిఎం ఆహ్వానం

ముఖ్యమంత్రి ట్విట్టర్ పోస్ట్ :-
• పెట్టుబడులు పెట్టేందుకు నేను పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నా
• APలో వ్యాపార అనుకూల ప్రభుత్వం, ప్రతిభావంతులైన యువత, ఉత్తమ మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలం
• పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో చర్చించి కొత్త పాలసీలు తెచ్చింది
• కొత్త పాలసీలు వేగవంతమైన వ్యాపార నిర్వహణకు దోహదం చేస్తాయి.
• మేము దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతారణ వ్యవస్థను నిర్మిస్తున్నాము.
• రాష్ట్రంలో మీ వ్యాపారానికి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాను.
• భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ లేదు.
• అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ రాదు!
• రాష్ట్రంలో పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది….రాష్ట్ర సామర్థ్యం పెరుగుతుంది
• ఆంధ్రప్రదేశ్‌లో మీ పెట్టుబడుల కోసం మేం ఎదురుచూస్తున్నాం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News