Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: పోలవరం - బనకచర్ల కోసం ఢిల్లీకి సీఎం చంద్రబాబు..! 

CM Chandrababu: పోలవరం – బనకచర్ల కోసం ఢిల్లీకి సీఎం చంద్రబాబు..! 

Chandra Babu Latest: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో హస్తినాపురంలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా..ఇతర కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై సీఎం సంబంధిత మంత్రులతో చర్చించనున్నారు.

- Advertisement -

సీఎం చంద్రబాబు కలవనున్న వారిలో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు సీఆర్ పాటిల్, అశ్వినీ వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయతో పాటు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ భేటీ కానున్నారు. ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు వాటికి అవసరమైన నిధుల కోసమే ఈ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనుల గురించి ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఇలా..
జులై 15వ తేదీ ఉదయన్నే అమరావతి నుంచి ఢిల్లీ బయల్దేరనున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇదే రోజున ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడైన వీకే సారస్వత్ తో పాటు ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. చివరిగా సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రుల మ్యూజియం లైబ్రరీలో జరిగే మాజీ పీఎం పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో సీఎం ప్రసంగించనున్నారు.

అలాగే జులై 16వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో చంద్రబాబు కలవనున్నారు. అనంతరం నార్త్ బ్లాక్ లోని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో పాటు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. జూలై 16 సాయంత్రం పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు సీఎం చంద్రబాబు హజరుకానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి.. జూలై 17న ఉదయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి విజయవాడ రానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad