Tuesday, October 22, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: భవిష్యత్ డ్రోన్స్ టెక్నాలజీదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: భవిష్యత్ డ్రోన్స్ టెక్నాలజీదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu| డ్రోన్స్ టెక్నాలజీ.. భవిష్యత్తు గేమ్ ఛేంజర్స్‌గా మారనుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్(Drone Summit)ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 1995లోనే తాను ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఆలోచించానని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చానని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మించానని తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి జరిగిందన్నారు. నాడు తాను వేసిన పునాదితో నేడు హైదరాబాద్ లక్షల కోట్ల ఆదాయం తెచ్చే నగరంగా తయారైందని వెల్లడించారు.

- Advertisement -

ఇదే విధంగా ఇప్పుడు ఏపీని కూడా తీర్చిదిద్దుతానని స్పష్టంచేశారు. ఇకపై డ్రోన్ హబ్‌ (Drone Hub)గా మార్చడమే తమ లక్ష్యమన్నారు. విజయవాడ వరదల్లో డ్రోన్ల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. రెస్క్యూ టీమ్స్ కూడా చేరుకోలేని చోటుకు డ్రోన్లను పంపిం ప్రజలకు ఆహారం, నీళ్లు, మందులు అందజేశామని తెలిపారు. వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లది కీలకపాత్ర అని.. అలాగే నగరాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు వాడొచ్చన్నారు. కొన్ని దేశాలు యుద్ధాల్లో డ్రోన్లు వాడుతున్నాయని.. తాము మాత్రం అభివృద్ధికి వీటిని ఉపయోగిస్తామని వెల్లడించారు.

అంతేకాకుండా శాంతిభద్రతల పరిరక్షణకు వాటిని వినియోగిస్తామన్నారు. పోలీసుశాఖలో విస్తృతంగా ఉపయోగించేందుకు కృషి చేస్తామన్నారు. డ్రోన్లతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచి వారిని నిమిషాల్లోనే పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి డ్రోన్ పైలట్ ప్రాజెక్టులకు ఏపీ వేదిక అవుతుందని పేర్కొన్నారు. మరో 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీని తీసుకొస్తామని చంద్రబాబు వివరించారు. డ్రోన్ కంపెనీలకు అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయన స్పష్టంచేశారు. కాగా విజయవాడలోని కృష్ణా నది తీరాన పున్నమి ఘాట్‌లో ఇవాళ సాయంత్రం 5వేలకు పైగా డ్రోన్లతో వివిధ కళాకృతులను ప్రదర్శించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News