Wednesday, November 20, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తాం.. సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu: ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తాం.. సీఎం చంద్రబాబు వార్నింగ్

CM Chandrababu| ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాలపై మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కారణం గంజాయి, డ్రగ్స్ వాడకమే కారణమని..అందుకే వాటిపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోబోమని..తాట తీస్తాం ఖబడ్దార్ అని హెచ్చరించారు. కరడుగట్టిన నేరస్తులకు ఏపీలో స్థానం లేదని, నేరస్తుల్ని శిక్షించడంలో ఎక్కడా రాజీపడమని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇక అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఉద్యోగాల కల్పన ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పని చేస్తోందని.. ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకు ఇన్సెంటివ్ ఎక్కువ ఇస్తామని ప్రకటించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని, ఇందుకోసం ఇప్పటికే రూ.890 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం జీవోలను దాచిపెడితే.. తాము అన్ని జీవోలను ఆన్‌లైన్లో పెడుతున్నామన్నారు.

గత ఐదేళ్లలో రాష్ట్రంలో 22A కింద భారీగా అక్రమాలు జరిగాయని తెలిపారు. భూ దోపిడీ జరగకుండా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్(Land Grabbing Act) తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఎవరైనా భూముల్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాల్ని బలితీసుకుందని ధ్వజమెత్తారు. కల్తీ మద్యం అమ్మకాలు జరగకుండా పారదర్శకంగా మద్యం పాలసీని తీసుకొచ్చామన్నారు. ఎవరైనా బెల్ట్ షాపు పెడితే బెల్టు తీస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News