CM Chandrababu| ఇకపై ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో అది చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ బిల్ (Prevention of Dangerous Activities Bill), ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 (Land Grabbing Act-2024) బిల్లు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్థలు గుండెల్లో రైళ్తు పరుగుత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని తెలిపారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుత హోంమంత్రి, డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు పెడుతున్నారని.. దళిత మహిళ అయిన హోంమంత్రికే రక్షణ లేకుండా పోతే ఇంకెవరికుంటుంది అని ప్రశ్నించారు. చెల్లి, తల్లిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని మాజీ సీఎం జగన్(Jagan) వెనకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ సోషల్ సైకో కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు తన నోటితో తాను చెప్పలేనని తెలిపారు. అసెంబ్లీలో ఉచ్చరించడానికి కూడా వీల్లేని విధంగా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు.
వర్రా రవీందర్‌రెడ్డి పేరుతో వేరే వాళ్లు పోస్టులు పెట్టారని జగన్ అంటున్నారని.. అలాంటి వ్యక్తిని జగన్ ఇంకా అతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఈ పోస్టుల వెనక ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డిపై కూడా కేసు పెట్టాలని కాంగ్రెస్ అధినేత్రి షర్మిల చెబుతున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసీపీ కార్యకర్తల చేత అసభ్యంగా పోస్టులు పెట్టించారని మండిపడ్డారు.