Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Jagan: బీసీ నేతలతో సీఎం జగన్ సమావేశం.. టార్గెట్ ఏంటో?

CM Jagan: బీసీ నేతలతో సీఎం జగన్ సమావేశం.. టార్గెట్ ఏంటో?

CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పార్టీలోని బీసీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, మోపిదేవి వెంకట రమణ, పార్ధసారధి, జంగా కృష్ణమూర్తి, అనిల్ కుమార్ లతో పాటు పార్టీలోని మిగతా బీసీ నేతలందరూ హాజరు కావాలని అధిష్టానం నుండి ఆదేశాలు వెళ్లాయి.

- Advertisement -

ఈ సమావేశంలో బీసీలకు అందిస్తున్న పథకాలు, పార్టీని బీసీలకు చేరువ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే.. నిజంగానే పథకాల గురించి చెప్పేందుకే సీఎం జగన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారా అంటే అంతకి మించి అంటూ రాజకీయ వర్గాల నుండి వినిపిస్తుంది. వైసీపీలో బీసీ నేతలు పైకి ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలకు దిగుతున్నా.. లోపల అసంతృప్తి మాత్రం తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పార్టీలో సీనియర్ బీసీ నేతలకు కూడా మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి రెండున్నరేళ్లకే పక్కన బెట్టేశారు. జగన్ సొంత సామజిక వర్గానికి చెందిన కొందరిని మాత్రం కొనసాగించారు.

ఆ తర్వాత నామినేటెడ్ పదవులను కూడా అన్నిటిని జగన్ సొంత సామజిక వర్గానికి చెందిన వారినే నియమిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. సలహా దారుల నుండి చైర్మన్ల వరకు అన్నీ రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారికే కేటాయిస్తున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న బీసీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. వీరిని బుజ్జగించేందుకు జగన్ ఈ సమావేశం పెట్టారాని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల కట్టడికి ఈ బీసీ నేతలను ప్రయోగించనున్నారని వినిపిస్తుంది. అయితే.. ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో.. ఆశావహులను ఎలా సంతృప్తి పరుస్తారన్నది చూడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News