తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు(శుక్రవారం) తిరుమల(Tirumala)కు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సమాచారం అందిందతి. దీంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- Advertisement -
తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి దర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్బంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు వస్తుండటంతో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.