Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagananna Vidya Deevena : సామాజిక హక్కు గురించి మాట్లాడే అర్హత వాళ్లకి లేదు -...

Jagananna Vidya Deevena : సామాజిక హక్కు గురించి మాట్లాడే అర్హత వాళ్లకి లేదు – సీఎం జగన్

పిల్లలకు తల్లిదండ్రులిచ్చే ఆస్తి ఏమైనా ఉందంటే అది చదువేనన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే తన ధ్యేయమని, వారికోసమే విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. జులై – సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు రూ.694 కోట్ల విద్యాదీవెన నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు తనకు గుర్తున్నాయన్నారు. విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద పూర్తిస్థాయిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ ను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నామన్న సీఎం.. ఈ పథకాల కోసం రూ.12,401 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్ బాగుండాలన్నదే తన ధ్యేయమన్నారు. పిల్లల చదువుకు ఖర్చు పెట్టే ప్రతిరూపాయిని వ్యయంగా కాకుండా, ఆస్తిగా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు.

అక్కడే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విమర్శలు చేశారు సీఎం జగన్. మహిళలను మోసం చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత గురించే మాట్లాడే హక్కు లేదన్నారు. టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad