Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే..?

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే..?

Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం 20 గంటల సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి కూడా నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది.

- Advertisement -

అటు మంగళవారం ఒక్కరోజే శ్రీవారిని 61, 448 మంది భక్తులు దర్శించుకోగా.. 21, 374 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3. 81 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD)అధికారులు తెలిపారు.

మరోవైపు ఉద్యోగాల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌లో కాంట్రాక్ట్ ప్రాతికన మెడిసిన్ రంగంలో పోస్టులకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తొంది. వీటిలో పీడియాట్రిక్‌ కార్డియాక్‌ అనస్తటిస్ట్‌, పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పోస్టులకు కూడా నోటిఫికేషన్లు విడుదలైనట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News