బేతంచెర్ల నగర పంచాయతీ 5 వార్డులో బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జాకిరుల్ల బేగ్ ఆధ్వర్యంలో టిడిపి పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, మండల కన్వీనర్ ఉన్నం ఎల్ల నాగయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి, డోన్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో పేద బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో మార్పు రావడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో ఉన్న సహజవనరులన్నీ కొల్లగొట్టారన్నారు. రాష్ట్ర వనరులను రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించకుండా, సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ అక్రమ మార్గంలో సంపాదించి,దోచుకోవడం- దాచుకోవడం తప్ప, అభివృద్ధి శూన్యం అన్నారు. సంపదను సృష్టించ లేక,ఉన్న సహజ వనరులను కొల్లగొట్టి, తన బినామీ కంపెనీలకు మళ్లించారన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దివాలా తీయించి, మరో బీహార్ రాష్ట్రంగా మార్చడం ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, నంద్యాల పార్లమెంటు ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వర రెడ్డి , టిడిపి సీనియర్ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, భీమేశ్వరరెడ్డి, పట్టణ సమన్వయ కమిటీ చైర్మన్ ఉన్నం సుధాకర్, నియోజకవర్గ గౌరవ సలహాదారులు కాకర్ల తిరుమలేష్ చౌదరి, బుగ్గన ఆనంద్ రెడ్డి, కె.పి భూపాల్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి రవీంద్ర నాయక్ , జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రూబిన్, లోడ్డ శేఖర్, రేగాటి భీమారెడ్డి,జె.వెంకటేశ్వర్లు, ముల్ల, మండల జె.రామ నాథం, కౌన్సిలర్ పి.రామాంజనేయులు, జనసేన నాయకులు శ్రీ కంటి మధు, టైలర్ రాముడు, ఫయాజ్, గుడివాడ కృష్ణమూర్తి, ఎమ్మెస్ , మధు లోకేశ్వర్ రెడ్డి, కెవి సుబ్బారెడ్డి, చంద్ర, సిమెంట్ నగర్ రాముడు, గూటం శివ, బుక్కాపురం లక్ష్మన్న, మురళి, పుట్టపాశం, మోహన్ గౌడు, జగదీష్, రామ్ మద్దయ్య, నల్లడి, సుభాని, వి రమణ, బెల్లం రామనాథం, రవి, బుక్కాపురం చెన్నయ్య, కానాల అంజి, రామకృష్ణ, చెర్రీ, తదితరులు పాల్గొన్నారు.