Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganur: చంద్రన్న కోసం ట్రాన్స్ జెండర్స్ నిరసన

Emmiganur: చంద్రన్న కోసం ట్రాన్స్ జెండర్స్ నిరసన

అంబేద్కర్ ను వేడుకొన్న ట్రాన్స్ జెండర్స్

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, చంద్రన్న కోసం మేము సైతం అంటూ ఎమ్మిగనూరు పట్టణంలోని ట్రాన్స్ జెండర్స్ నినదించారు. టిడిపి నేతలు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, ఎమ్మిగనూరు మండలం మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి, శ్రీనివాసులు, ముగతి వీరారెడ్డి ల ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్స్ పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వినతి పత్రం అందజేశారు. ట్రాన్స్ జెండర్స్ కు సామాజిక పింఛన్లు మంజూరు చేసి ఆత్మగౌరవంతో బ్రతికేలా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్స్ సిరి, సాధిక్, నాగవేణి, పుష్ప తో పాటు టిడిపి నాయకులు బనవాసి శ్రీకాంత్ రెడ్డి, కె.యం.డి. అబ్దుల్ జబ్బర్, గోరాబాషా, జోహార్ అబ్బాస్, రోజా ఆర్ట్స్ ఉసేని, దర్జీ మోషన్న, యస్. సాల్మన్, కనకవీడు పెద్ద ఈరన్న పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News