Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఘనంగా బసవేశ్వర జయంతి

Emmiganuru: ఘనంగా బసవేశ్వర జయంతి

ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి శ్రీ బసవేశ్వర స్వామి పేరు పెట్టాలనీ వీర శైవ లింగాయిత్ సంక్షేమ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ నాగరాజు కోరారు. ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురం గ్రామంలో శ్రీ బసవేశ్వరుల సనాతన ధర్మాచారం విశ్వమానవాళికి సామాజిక మణిహరంగా ఉన్న బసవేశ్వర స్వామి 892 జయంతినf ఘనంగా నిర్వహించారు. కె తిమ్మాపురం గ్రామంలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయంలో రుద్రాభిషేక పూజ చేసి శ్రీ బసవేశ్వర స్వామి చిత్రపటాన్ని గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి అన్నదానం చేశారు. బసవేశ్వరుడి కాలంలో కొంత మంది ఉన్నత వర్గాల మతస్థులు ఇతరులకు లింగదర్శనం విషయంలో విధించిన ఆంక్షలను, కట్టుబాట్లను తొలగించి సర్వమతాల సంరక్షణ కోసం, అన్ని వర్గాల ప్రజలకు అతీతంగా లింగదర్శనం చేసుకునేలా “ఇష్టలింగ” పూజా విధానాన్ని, సనాతన సామాజిక ధర్మాచారాన్ని ప్రవేశపెట్టిన గొప్ప సంఘ సంస్కర్త అని నిమ్నజాతి వర్గ ప్రజల పెన్నిధి అన్నారు. సాక్ష్యాత్తు భారత ప్రభుత్వం నూతనంగా నిర్మించిన, నిర్మిస్తున్న దేశ పార్లమెంటు భవనం” నకు ఈయన పేరును నామకరణం చేయాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరు ఈయన సనాతన సామాజిక ధర్మాచారాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు, ఈయన విశ్వమానవాళికి సామాజిక మణిహరం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పెద్ద బసన్న, ప్రధాన కార్యదర్శి బి పెద్ద రామలింగప్ప, బి ఈరన్న, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News