వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఎమ్మిగనూరు అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తా నని ఎన్నికల ప్రచారంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో స్ధానిక 18వ వార్డులో కౌన్సిలర్ రంగమ్మ, ఇన్ ఛార్జ్ సోమేశ్ ఆధ్వర్యంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక వార్డులో గడప, గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగించారు.
ఏం మీరెవరూ హైదరాబాద్ పోవట్లేదా?
ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ బుట్టా రేణుక గెలిస్తే హైదరాబాద్ కు పోతుందని, లోకల్ కాదని టీడీపీ నాయకులు చెప్పడం సరికాదన్నారు. ఒకసారి ఎంపిగా గెలిచి, ఏ ఎంపీ చేయని విధంగా అభివృద్ది చేసి చూపించినందుకే నేడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నాకు ప్రజల నుండి ఇంత మంచి స్పందన వస్తోందన్నారు. ప్రతి గ్రామం పట్టణం తిరిగి అక్కడి ప్రధాన సమస్యలపై పార్లమెంటులో లేవనెత్తి, సమస్యల పరిష్కారం కోసం నా వంతు పాత్ర పోషించాను అన్నారు. ఎవరైతే హైదరాబాద్ అంటున్నారో వారు, వారి అవసరాల నిమిత్తం హైదరాబాద్ కు పోకుండా ఒక్కరైనా ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఆ కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
నేను చేసిన అభివృద్ది పనుల వలనే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గుర్తుంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుట్టా శివనీలకంఠ , బుట్టా ప్రతూల్ , రియాజ్ ఆహ్మద్, బుట్టా రంగయ్య, బసరకోడు వీరేంద్ర, సునీల్ కుమార్, అబ్రర్, వాహీద్ యిసాక్, రాజారత్నం, అమాన్, సుధాకర్, కోటకొండ నరసింహులు, విశ్వనాథ్, చంద్ర శేఖర్, ఖిబుల రహంతుల్లా, డీలర్ మధు, గట్టు ఖజా, జి యమ్ బాషా, రజాక్, ఫయాజ్, ఉబేద్ పాల్గొన్నారు.