Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: నామినేషన్ వేసిన బుట్టా రేణుక

Emmiganuru: నామినేషన్ వేసిన బుట్టా రేణుక

వైసీపీ భారీ ర్యాలీ

ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా బుట్టా రేణుక నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అర్ఓ చిరంజీవికి బుట్టా రేణుక నామినేషన్ పత్రాలను అందజేశారు. బుట్టా రేణుకకు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ప్రోపోజల్ గా నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ముందుగా వైసిపి కార్యాలయంలో బుట్టా రేణుక సర్వ మత ప్రార్థనలు చేశారు. హిందూ ముస్లిం, క్రైస్తవ పద్దతిలో ప్రార్థనలు, పూజలు చేశారు. ఆయా మత గురువులు అస్సిస్సులు అందుకున్నారు.

- Advertisement -

అక్కడి నుంచి భారీ ర్యాలీ మధ్య సోమప్ప సర్కిల్ కు చేరుకున్నారు. నామినేషన్ వేయడానికి అర్ఓ ఆఫీసుకు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య , వీర శైవ లింగాయిత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, వైసిపి లీగల్ సెల్ నాయకులు న్యాయవాది మధన్ మోహన్ రెడ్డిలు బుట్టా రేణుక వెంట వెళ్లారు.

కార్యక్రమంలో వైసిపి నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్, బుట్టా అమోగ్, బుట్టా యుగంధర్, బుట్టా నాగరాజు, నజీర్ అహ్మద్, నాగేష్ నాయుడు, బసిరెడ్డి, శివప్ప గౌడ్, లక్ష్మి కాంత్ రెడ్డి, కృష్ణ రెడ్డి, బుట్టా రంగయ్య, నక్కలమిట్ట శ్రీనివాసులు, నసీరుద్దీన్, శివ ప్రసాద్, విశ్వనాథ్ రమేష్, మూగతి విరుపాక్షి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News