ఎమ్మిగనూరు పట్టణం 10 వ వార్డుకు చెందిన అగ్ని ప్రమాద బాధితురాలికి వైకాపా సమన్వయ కర్త బుట్టా రేణుక ఆర్థిక సహాయం అందించారు. స్థానిక 10 వ వార్డు లో అగ్ని ప్రమాదంలో గుడిసె కాలిపోయిన బాధితురాలు వద్దకు వెళ్లి బుట్టా రేణుక ఓదార్చారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో గుడిసె కాలిపోయిన బాధితురాలిని ఆడుకోవడానికి సహకారం అందించామని, భవిషత్తులో ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
- Advertisement -
కార్యక్రమంలో వైకాపా నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, కౌన్సిలర్ రాజారత్నం , బుట్టా రంగయ్య, గోర మహబూబ్ బాషా పాల్గొన్నారు.