ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి బుట్టా రేణుకను ప్రజలు, నిరుద్యోగులు నిలదీశారు. స్థానిక 3 వ వార్డులో బుట్టా రేణుక ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి వైసిపిను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా కొంత మంది ప్రజలు బుట్టా రేణుకను ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా అని నిరుద్యోగి ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని వారు అన్నారు.
ఓ మహిళ మాట్లాడుతూ ..తమ వార్డులో రోడ్లు, డ్రైనేజీలు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం చేసే వారికే ఓటు వేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు.
కార్యక్రమంలో శాప్ నెట్ వర్క్ చైర్మన్ మాచాని వెంకటేష్, 3 వ వార్డు కౌన్సిలర్ స్వాతి,వైసిపి వార్డు ఇంఛార్జి వినయ్, నాయకులు బుట్టా రంగయ్య,సునీల్ కుమార్, రియాజ్ అహమ్మద్, కోటకొండ నరసింహులు, విశ్వనాథ్ రమేష్, గట్టు ఖాజా, హుసేన్ , ఆబ్రార్, అంపమ్మ, రాజారత్నం, సుధాకర్, వహీద్, అమాన్, శివ ప్రసాద్, చంద్ర శేఖర్, రుద్రాక్షల బజారి, ప్రతాప్ రెడ్డి, చాంద్, రఘు, మదు, సలీం, ఉబేదుల్లా, ఫయాజ్, ఉబేద్, గౌస్ పాల్గొన్నారు.