Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: మాదిగల సింహ గర్జన కరపత్రాలు విడుదల

Emmiganuru: మాదిగల సింహ గర్జన కరపత్రాలు విడుదల

హక్కులను, ఆత్మగౌరవం కోసం..

జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో ప్రైవేట్ ఆవరణము నందు విలేకరుల సమావేశంలో చలో కర్నూల్ సింహ గర్జన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడ రవి మాదిగలు మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లా ఎస్వి కాంప్లెక్స్ ఎదురుగా B. A. S కళ్యాణమండపం నందు మాదిగల సింహ గర్జన సభను 20 డిమాండ్లతో జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ సభకు వేలాది మంది తరలి వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిస్తూ, ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి మాట నిలబెట్టుకోవాలని అన్నారు.

- Advertisement -

రాబోయే రోజుల్లో జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘం మాదిగ హక్కులను, ఆత్మగౌరవాలను సాధించి, రాజ్యాధికారం వైపు నడిచే దిశగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ,కార్యదర్శి మాదిగ రత్నం, కన్వీనర్ గందాలం మణికుమార్,ఆదోని డివిజన్ అధ్యక్షుడు జగ్గుల యోహాను మాదిగ,మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి సంగటి యోహాను మాదిగ, ఎమ్మిగనూరు మండల అధ్యక్షులు పెద్ద ముష్టి అబ్రహం మాదిగ,నందవరం మండల అధ్యక్షులు శావల బుజ్జిబాబు,మండల ఇన్చార్జి చింపిరి చిన్న పోతప్ప మాదిగ,పెద్ద కడబూర్ మండల అధ్యక్షుడు మంచోది ఆదాము మాదిగ, మండల ఇన్చార్జి మంచోది రవికుమార్ మాదిగ, గోనెగండ్ల మండలం నాయకులు యనగండ్ల ప్రసన్నకుమార్,పుట్టపాశం సోమన్న, జైనపోగు రాజ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News