నవరత్నాలను 100 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఎమ్మిగనూరు వైసిపి నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. జగనన్న మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వేలోని మొదటి 15 రోజుల్లో కోటి కుటుంబాలు పాల్గొన్నగా సీఎం జగన్ పాలనకు మద్దతుగా 79 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. మెగా సర్వేలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 90 శాతం పూర్తి అయ్యిందని, రాబోయే రోజుల్లో మిగిలిన వాటిని సందర్శించాలనే లక్ష్యం తో పని చేస్తున్నాము. కుల, మత, వర్గ, విపక్ష లేకుండా.. ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయని భావించే ప్రాంతాలపై దృష్టి సారించి, సీఎం జగనన్న పాలనలో అక్కడి ప్రజలకు జరిగిన మంచిని వివరించాలనే ఉదేశ్యం తో వైఎస్సార్సీపీ ముందుకు వెళుతోందని అన్నారు. మెగా సర్వేలో వచ్చిన అద్భుత ఫలితాలు, ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన గురించి మీకు తెలియజేస్తున్నందుకు చాలా అనందంగా ఉందని,సీఎం జగనన్న పై ప్రజలకు ఉన్న నమ్మకం మాటల్లో చెప్పలేనిదని ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది. వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మక ఈ మెగా సర్వే , క్షేత్ర స్థాయి పర్యటనల తర్వాత ప్రజల తమ, వారి పిల్లల భవిష్యత్తు కోసం విశ్వసించే ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని తేటతెల్లం కానుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిఆర్ బసిరెడ్డి, ఎంపీపీ కేశన్న, మండల కన్వీనర్ శివప్ప గౌడ్, మండల యూత్ ప్రెసిడెంట్ బందె నవాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. మన్సూర్, పట్టణ ప్రధాన కార్యదర్శి బసరకోడు వీరేంద్ర, అధికార ప్రతినిధి కె. సునీల్ కుమార్, పట్టణ సచివాలయం కన్వీనర్లు షబ్బీర్ ఆహ్మద్, బంగి శ్రీరామ్, మండల కన్వీనర్ చాంద్ బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాద్యాక్షులు రియాజ్ ఆహ్మద్, ఎంపిటిసీ ఈరన్న, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ అదవుల్లా పాల్గొన్నారు.