విజయవాడలో భారీ అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మంటలు ధాటిగా పొగ దట్టంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Fire accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES