Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Gangula: ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు-ఎమ్మెల్యే

Gangula: ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు-ఎమ్మెల్యే

'గడప గడపకు'లో పాల్గొన్న గంగుల

ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని 4 సచివాలయం పరిధిలోని గాయత్రి వీధి, రామకృష్ణ రెడ్డి నగర్, మైకేల్ వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసన సభ్యులు గంగుల బిజేంద్రా రెడ్డి విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డిలతో కలసి పాల్గొన్నారు. సచివాలయ పరిధిలో చేరుకోగానే ఎమ్మెల్యే గంగులకు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -


ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించ వలసిందిగా సంబంధింత అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. ఇంకా అర్హులై ఉండి సంక్షేమ పథకాలు వారు ఉంటే సచివాలయ సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గురుమూర్తి చక్రపాణి,బాలబ్బి, కాంట్రాక్టర్ అజాద్, ఎస్సై వెంకట్ రెడ్డి, అల్లా బకాష్, భాస్కర్ రెడ్డి వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News